దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్లో రూపొందుతున్న టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీయస్ ప్రాజెక్ట్ “ఆర్ఆర్ఆర్”. హై టెక్నికల్ వేల్యూస్ తెరకెక్కుతున్న చిత్రమిది. అలియా భట్, సముద్రఖని, అజయ్ దేవగణ్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ పాత్రలో, రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బేనర్‌పై దానయ్య చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు నిజ పాత్రల కల్పిత కథాంశమే ఈ చిత్రమని ఇది వరకే రాజమౌళి తెలియజేశారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బేనర్‌పై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 30, 2020న విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో కొమురం భీమ్ పాత్రలో నటించిన ఎన్టీఆర్ లుక్‌ని అక్టోబర్ 22న కొమురం భీమ్ జయంతి రోజున విడుదల చేస్తారట. అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నట్టు తెలుస్తుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త అభిమానులకి షాక్ ఇస్తుంది. “ఆర్ఆర్ఆర్” చిత్రంలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ కీలక పాత్ర పోషిస్తుండగా, ఆయన చరణ్‌కి తండ్రిగా కనిపించనున్నాడట. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో అజయ్ దేవగణ్ పాత్ర ఉంటుందని సమాచారం. ఈ చిత్రానికి గాను అజయ్‌కి 30 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేసారని టాక్.
previous post