telugu navyamedia
సినిమా వార్తలు

బిగ్ బాస్-3లో నన్ను హింసించారు : నటి మధుమిత

Bigg-Boss-3

తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ వ్యాఖ్యాతగా తమిళంలో ప్రసారం అవుతున్న “బిగ్‌బాస్-3” మొదటి నుంచీ వివాదాలకు నెలవైంది. తాజాగా ఈషోపై నటి మధుమిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. హౌస్‌లో ఆత్మహత్యా యత్నం చేసి కలకలం రేపిన మధుమిత గత నెలలో బయటకు వచ్చింది. హౌస్‌లో ఉన్నన్నాళ్లూ సహచర కంటెస్టెంట్‌లు తనను హింసించారని, బలవంతంగా బయటకు పంపారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. హౌస్‌లో ఇంత జరుగుతున్నా ఏమాత్రం పట్టించుకోలేదంటూ హోస్ట్ కమల్ హాసన్‌పైనా ఆరోపణలు చేసింది. రెండు వారాల క్రితం మీడియా సమావేశంలో నటి మాట్లాడుతూ… విజయ్ టీవీ తనపై తప్పుడు కేసు పెట్టిందని పేర్కొంది. ముందుగా ఒప్పందం చేసుకున్న ప్రకారం తనకు ఇస్తానన్న డబ్బులను టీవీ ఛానల్ ఇవ్వలేదని ఆరోపించింది. హౌస్‌లో ఎందుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడాల్సి వచ్చిందని విలేకరులు పదేపదే ప్రశ్నించినప్పటికీ ఆమె సరైన సమాధానం ఇవ్వలేదు. ప్రెస్‌మీట్ పెట్టి ఘటన వెనక ఉన్న అన్ని విషయాలు వెల్లడిస్తామని విజయ్ టీవీ తనకు హామీ ఇచ్చిందని మధుమిత పేర్కొంది. అయితే, విజయ్ టీవీ మాత్రం ఇప్పటి వరకు ఈ విషయంలో స్పందించకపోవడం గమనార్హం.

Related posts