బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు సమాచారం. ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న జైట్లీని చూసేందుకు ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు వెళ్లారు. కొద్ది సేపట్లో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా కూడా జైట్లీని చూసేందుకు ఆసుపత్రికి వెళతారని సమాచారం.
ఎయిమ్స్ లో జైట్లీ ఆరోగ్యపరిస్థితి గురించి తెలుసుకునేందుకు రాజ్ నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, రామ్ విలాస్ పాశ్వాన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ డాక్టరు కృష్ణా గోపాల్, సమాజ్ వాదీ పార్టీ మాజీ నేత అమర్ సింగ్, హిమాచల్ ప్రదేశ్ కల్రాజ్ మిశ్రా తదితరులుఇప్పటికే అక్కడికి వెళ్లారు. జైట్లీ ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 9న జైట్లీ ఎయిమ్స్ లో చేరారు.