ఢిల్లీ మాజీ సీఎం సుష్మాస్వరాజ్ మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి రాజకీయ లాభాపేక్ష లేకుండా దేశవ్యాప్తంగా, పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన ఆమె… రాష్ట్ర ప్రజల మనసుల్లో చిన్నమ్మగా నిలిచిపోయారని చెప్పారు.
గల్ఫ్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎందరో తెలంగాణ ప్రవాసులకు విదేశాంగ శాఖ మంత్రిగా సాయం చేశారన్నారు. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయాలనే ఆలోచనను కూడా ఆమె తీవ్రంగా వ్యతిరేకించారని అన్నారు. సుష్మకు తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారని చెప్పారు. హైదరాబాదులో సుష్మాస్వరాజ్ విగ్రహ ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకోవాలని కోరారు.


