telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

అన్నం వండలేదని చెప్పిన భార్య..కాళ్లు, చేతులు కోసిన భర్త

Two sons murder after father sucide

అన్నం వండలేదని చెప్పిన భార్యను ఓ కిరాతక భర్త కాళ్లు, చేతులు కోసేసిన దారుణ ఘటన విజయవాడ చిట్టినగర్‌ ప్రాంతం గొల్లపాలెంగట్టులో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అన్నపురెడ్డి జగదీష్‌రెడ్డి, హాసినికి ఏడేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలు. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న జగదీష్‌ సంపాదన అంతా సొంత ఖర్చుకే తగలేసి ఇంటి నిర్వహణకు మాత్రం డబ్బులు సరిగా ఇవ్వడు. ఈ విషయంలో తరచూ దంపతుల మధ్య గొడవ జరుగుతుండేది.

ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి తర్వాత ఇంటికి వచ్చిన జగదీష్‌ భోజనం పెట్టమని భార్యను కోరాడు. బియ్యం లేక వంట చేయలేదని ఆమె చెప్పడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. సమీపంలోని చాకు తీసుకుని ఆమె చేతుల, కాళ్లు మీద విచక్షణా రహితంగా కోసేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts