బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ తాజాగా నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ “కొబ్బరి మట్ట”. హృదయ కాలేయం టీం నుండి వస్తున్న ఈ చిత్రానికి రూపక్ రొనాల్డ్సన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పెదరాయుడు, ఆండ్రాయుడ్, పాపారాయిడు ఇలా మూడు విభిన్న పాత్రలలో కనిపించి సందడి చేయనున్నాడు సంపూ. 2015లో మొదలైన ఈ చిత్రం జూలై 19న విడుదల కానుందని ఇటీవల మేకర్స్ ప్రకటించారు. కాని మళ్ళీ ఆ డేట్ మారుస్తూ ఆగస్ట్ 2న చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. “కొబ్బరి మట్ట” చిత్రానికి సంబంధించి గతంలో పలు సాంగ్స్, టీజర్ కూడా విడుదల చేశారు మేకర్స్. వాటికి మంచి స్పందన వచ్చింది. ఇక తాజాగా చిత్రం నుండి “అ..ఆ , ఇ..ఈ….” అంటూ సాగే పాటకి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ పాట మొత్తం తెలుగు అక్షరమాలతోనే ఉండగా ఇందులో సంపూర్ణేష్ స్టెప్స్ అభిమానులకి మంచి వినోదాన్ని కలిగిస్తున్నాయి.
“హృదయ కాలేయం”, “సింగం 123” తర్వాత కొన్ని చిత్రాలలో సపోర్టింగ్ రోల్స్ చేసిన సంపూ ఇప్పుడు “కొబ్బరి మట్ట”తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.