డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ చిన్నరాష్ట్రాల ఆలోచన వల్లే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా టీఆర్‌ఎస్ భవన్‌లో జరిగిన వేడుకల్లో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళుర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఆనాడు చిన్నరాష్ట్రాల అంశాన్ని అంబేడ్కర్ ఆలోచన చేయక పోయి ఉంటే ఈరోజు తెలంగాణ ఏర్పాటు సాధ్యమయ్యేది కాదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విధానాలన్నీ అంబేడ్కర్ చూపిన మార్గంలోనే సాగుతుంటాయని అన్నారు. తెలంగాణ సాధన కోసం అంబేడ్కర్ విధానాలతోనే కేసీఆర్ ముందుకు వెళ్లారని చెప్పారు. దేశంలోని అన్నివర్గాల వాడు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అని కొనియాడారు.