telugu navyamedia
సినిమా వార్తలు

జపాన్ లో “సాహో” విడుదలకు సన్నాహాలు

prabhas
బాహుబ‌లి సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ రేంజ్ ఎంతలా పెరిగిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తరువాత సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ హీరోగా అత్యంత భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్నభారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ “సాహో”. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ స్పై థ్రిల్ల‌ర్‌ లో శ్ర‌ద్ధా క‌పూర్ హీరోయిన్ గా న‌టిస్తుంది. కొన్ని రోజుల క్రితం చిత్రానికి సంబంధించి వీడియోలు విడుదలై భారీ ప్రేక్షకాదరణను పొందాయి. అయితే “సాహో” చిత్రాన్ని ఇండియాలోని ప‌లు భాష‌ల‌లో విడుద‌ల చేయాల‌ని ఇప్ప‌టికే దర్శకనిర్మాతలు భావించ‌గా, ప్ర‌భాస్‌కి ఉన్న క్రేజ్ దృష్ట్యా జ‌పాన్‌లోను విడుదల చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. బాహుబ‌లి చిత్రంతో ప్ర‌భాస్‌కి జ‌పాన్‌లో విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. దీంతో “సాహో” చిత్ర రైట్స్‌ని ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూష‌న్ సంస్థ‌కి రీజ‌న‌బుల్ రేటుకే అందిచాల‌ని అనుకుంటున్నార‌ట‌. ఇండియాలో రిలీజ్ అయిన కొన్ని వారాల త‌ర్వాత జ‌పాన్‌లో సాహో విడుద‌ల కానుంద‌ని స‌మాచారం.
ఇక ఈ చిత్రంలోని స్పెషల్ సాంగ్ కోసం పాప్ గాయ‌నిగా వ‌ర‌ల్డ్‌వైడ్‌గా పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందిన బ్రిటీష్ భామ కైలీ మినోగ్‌ ను తీసుకురాబోతున్నారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో నీల్‌ నితిన్ ముకేశ్, జాకీ ష్రాఫ్, అరుణ్ విజయ్, ఎవ్‌లిన్ శర్మ, చుంకీ పాండే వంటి స్టార్స్‌ కీలకమైన పాత్రల్లో న‌టిస్తున్నారు. యాక్ష‌న్ స‌న్నివేశాల కోసం హాలీవుడ్ టెక్నీషియ‌న్స్ ప‌ని చేస్తున్నారు. 

Related posts