ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం వేడెక్కిన వేళ పలువురు సినీ ప్రముఖులు పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. పోసాని, రైటర్ చిన్నికృష్ణ, కోన వెంకట్ ఇలా వరుసగా మెగా ఫ్యామిలీపై విమర్శలు కురిపించారు. ఒకప్పుడు పవన్ ను నెత్తిన పెట్టుకున్న వీళ్ళు ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మరీ పవన్ ను విమర్శించడానికి గల కారణం ఎన్నికలే అనే విషయం అందరికీ తెలిసిందే.
అయితే గతంలో పవన్ నా సోల్ మేట్ అంటూ ప్రకటించిన కోన వెంకట్ ఇలా విమర్శలు చేయడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పై తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఓ ప్రెస్ నోట్ ను విడుదల చేశారు కోన వెంకట్. పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పానని, పొలిటికల్ గా తనకు మంచి జరగాలని కోరుకునే వ్యక్తుల్లో మొదటి వ్యక్తి తానేనని, కానీ ఆ విషయం మాత్రం రాయలేదని, మాయావతి గారితో పొత్తు విషయంలో జాగ్రత్తగా ఉండమని కూడా చెప్పానని స్పష్టం చేశారు. మన రాజకీయ ఆలోచనలు, మన కులాలు, మతాలు, ప్రాంతాలు, ఆర్ధిక స్థోమతలు, ఇవేవీ స్నేహానికి అడ్డుగోడలు కాకూడదు” అంటూ పవన్ పై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు కోన వెంకట్. కానీ పవన్ అభిమానులు మాత్రం ఇంకా కోన వెంకట్ పై మండిపడుతూనే ఉన్నారు.
Official Press Release From Kona Venkat regarding his family’s political association, YSRCP, Jana Sena & Pawan Kalyan. pic.twitter.com/u9MaTHIdXc
— Vamsi Kaka (@vamsikaka) 26 March 2019
బికినిలో హీరోయిన్… ఫైర్ అవుతున్న నెటిజన్లు