telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విశాల్ నన్ను పెళ్ళి చేసుకుంటానని అడిగారు… కానీ…!

Vishal

నటి మీరామిథున్‌ తన వివాదస్పద వ్యాఖ్యలతో కోలీవుడ్ లో దుమారం రేపుతోంది. తాజాగా మరో వివాదస్పద అంశానికి తెర తీశారు. ఈసారి విశాల్‌ను టార్గెట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాజీ మేనేజర్‌ విడుదల చేసిన ఒక వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్‌ అవుతోంది. అందులో విశాల్‌ తనను పెళ్లి చేసుకుంటానని రెండు, మూడు ఏళ్లుగా అడుగుతూ వచ్చారని మీరా మిథున్‌ పేర్కొన్నారు. తన తల్లికి విశాల్‌ అంటే చాలా ఇష్టమని, అయితే తనకు ధనవంతుడైన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, అందుకే విశాల్‌ను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించినట్టు తెలిపారు. మరి దీనికి విశాల్‌ ఎలా స్పందిస్తారో చూడాలి. ఇటీవలే త్రిషపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఈ బ్యూటీ ఆ మధ్య హీరోలు విజయ్, సూర్యలపై నెపోటిజం విమర్శలు గుప్పించింది. దీంతో మీరామిథున్‌ వ్యాఖ్యలపై ప్రముఖ దర్శకుడు భారతీరాజా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెను తీవ్రంగా హెచ్చరించారు. ఇక రజనీకాంత్‌ రాజకీయ రంగ ప్రవేశం గురించి కూడా ఈ బ్యూటీ వివాదస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.

Related posts