telugu navyamedia
సినిమా వార్తలు

బాలీవుడ్ పై బాబా సెహ‌గ‌ల్‌ ఫైర్… ఎవ‌ర్ గ్రీన్ సాంగ్స్‌ రీమిక్సే కారణం…!

Baba-Sehgal

బాబా సెహ‌గ‌ల్‌ ఎన్నో హిట్స్ సాంగ్స్ ఆలపించి పలు భాషల్లో క్రేజ్ ను సంపాదించుకున్నారు. తాజాగా ఆయన బాలీవుడ్ పై ఫైర్ అయ్యారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేస్తూ… “బాలీవుడ్ కాపీవుడ్‌లా తయారైంది. ఆ నాటి ఎవ‌ర్ గ్రీన్ సాంగ్స్‌ని రీమిక్స్ చేసే ప‌ద్ద‌తి బాలీవుడ్ ఇప్ప‌టికైన ఆపాలి. రీమిక్స్ చేస్తే కొత్త ద‌నం ఏమి ఉండ‌దు. కళాకారులు, సాహిత్యం, సంగీత ప‌రిక‌రాల‌తో స‌రికొత్త ప్ర‌యోగాలు చేయాలి. ఓ హిట్‌ గీతాన్ని రీమేక్‌ చేస్తున్నప్పుడు మనపై ఎన్నో బాధ్యతలు ఉంటాయి. రీమిక్స్‌ పేరుతో పాటను అద్భుతంగా కంపోజ్‌ చేయకపోగా… ఒరిజినల్ పాటని అగౌరవపరుస్తున్నారు. ఆ త‌రం పాట‌ల‌ని నేటి సంగీత ద‌ర్శ‌కులు రీమిక్స్ చేస్తూ ఒరిజిన‌ల్ సారాంశాన్ని నాశనం చేస్తున్నారు. నిర్మాత‌ల ఆలోచ‌న ధోర‌ణిలో కూడా మార్పు రావాలి. రీమిక్స్‌ని ప్రొత్స‌హించ‌కుండా కొత్త టాలెంట్ ప‌ట్టుకు రావాలి. హిట్ గీతాల‌ని త‌మ వ‌ర్షెన్‌లో పాడుకునే సింగ‌ర్స్ వీడియోలు చాలా చూశాను. రియాలిటీ షోల‌లో పాడే చిన్నారుల ప్ర‌తిభ చూశాను. అలాంటి వారిని ఆద‌రిస్తే బాగుంటుంది. రీమిక్స్ విష‌యంలో నా ఒపీనియ‌న్ మీతో షేర్ చేసుకున్నాను. నేను ఎవ‌రిని త‌ప్పు ప‌ట్ట‌డం లేదు. నన్ను అపార్ధం చేసుకోర‌ని అనుకుంటున్నా” అంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి.

Related posts