ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో హైడ్రా కమిషనర్ ఏ.వీ. రంగనాథ్ సమావేశమయ్యారు. మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్‌లో ఆయన మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
దాదాపు రెండు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. హైదరాబాద్‌లో చెరువులు, ప్రభుత్వ భూముల రక్షణకు హైడ్రా కృషి చేస్తోన్న విషయం తెలిసిందే.
హైడ్రా హైదరాబాద్ నగరంలో కోట్లాది రూపాయల విలువ చేసే భూములను పరిరక్షించింది.
ఈ నేపథ్యంలో వీరి మధ్య రెండు గంటల పాటు సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ నగరంలో హైడ్రా పనితీరు తదితర అంశాలపై వారి మధ్య చర్చ జరిగినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
అయితే, ఈ భేటీ మర్యాదపూర్వకంగా జరిగిందని పవన్ కల్యాణ్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

