telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అమరావతిలో సీఆర్డీఏ నూతన కార్యాలయ భవనాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సీఆర్డీఏ నూతన కార్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం ప్రారంభించనున్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొననున్నారు.

ప్రారంభోత్సవం అనంతరం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఢిల్లీకి పయనమవుతారు.

ఈ సీఆర్డీఏ కార్యాలయ భవనం 3.07 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడింది. మొత్తం 4.32 ఎకరాల స్థలంలో రూ.257 కోట్ల వ్యయంతో జీ+7 అంతస్తుల భవనంగా నిర్మాణం జరిగింది.

ఈ భవనంలో 300 వాహనాల పార్కింగ్ సౌకర్యం కల్పించారు.

భవనం ముందు భాగాన్ని ‘A’ ఆకారంలో తీర్చిదిద్ది అమరావతికి ప్రతీకగా నిలిచేలా రూపొందించారు. అదనంగా, 100 అడుగుల ఎత్తైన జాతీయ జెండా స్తంభాన్ని ఏర్పాటు చేశారు.

గత 8 నెలలుగా నిరంతరాయంగా నిర్మాణ పనులు కొనసాగగా, రోజువారీగా 500 మందికి పైగా కార్మికులు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు సమష్టిగా పనిచేశారు.

Related posts