telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

కురుల సౌందర్యానికి… ఇలా ..

tips for long healthy hair

ఒకప్పుడు కురులు నల్లగా, నిగనిగలాడుతూ, ఎంతో ధృడంగా ఉండేవి. నాటికీ-నేటికి ఏమిటి తేడా అంటే మారుతున్న కాలం, టెక్నాలజీ కి తగ్గట్టుగా విస్తరిస్తున్న కాలుష్యం, స్వచ్చమైన ఆహార నియమాలు లేకపోవడం, ఇలా రకరకాల కారణాలు శరీరకసౌష్టవాన్ని క్షిణింపచేస్తున్నాయి. దీనితో అందం, ఆరోగ్యాన్ని రెండిటిని శిధిలావస్థలోకి నెట్టేస్తున్నాయి. ఈ స్థితిలో కూడా కాస్త ప్రయత్నిస్తే, కురులని బలంగా మార్చుకోవచ్చు, ఆరోగ్యంగా చేసుకోవచ్చు అందుకు కొన్ని చిట్కాలు కూడా ఉన్నాయి. అవేంటంటే…

* వెల్లుల్లిపాయలు తీసుకుని అందులో పైన ఉండే పొట్టు తీసి. వేయించాలి. వేయించాగా వచ్చిన పొట్టు పొడిని కొబ్బరి నూనె, లేక మందార నూనె లో వేసుకుని జుట్టుకు పట్టించడం వలన అద్భుతమైన ఫలితం వస్తుంది.

* వారానికి రెండు సార్లు అయినా సరే కొబ్బరి నూనె జుట్టుకు పట్టించాలి. ఎందుకంటే. జుట్టుకు బలం రావాలంటే తప్పకుండా పోషక విలువలతో పాటు కుదుళ్ళు గట్టిపడేలా నూనేని కూడా పట్టించాలి.

* చాలా మంది చల్లని నీటితో స్నానం చేసేస్తారు. అలా చేయకూడదు. గోరు వెచ్చని నీటితోనే స్నానం చేయాలి.

* ఉసిరి , కుంకుండు, శీకాయ మిశ్రమాన్ని తీసుకుని సుమారు 20 నిమిషాల పాటు నానబెట్టి ఆ గుజ్జుని తలకి పట్టించాలి. ఆ తరువాత తల స్నానం చేయడం వలన జుట్టు బలంగా తయారవుతుంది.

* వాల్ నట్స్ కొన్ని తీసుకుని వాటిని క్యారెట్ తురిమినట్టుగా తిరుముకోవాలి. ఇలా వచ్చిన దాన్ని తీసుకుని నీటిలో వేసి మరగబెట్టి ఆ నీటిని దూది సాయంతో కుదుళ్ళ కి పట్టిస్తే మంచి ఫలితం కన్పిస్తుంది.

Related posts