ఐపీఎల్ 2020 లో ఈ రోజు దుబాయ్ ఢిల్లీ క్యాపిటల్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్ లో మొదటి ఓవర్ మొదటి బంతికే ఓపెనర్ పృథ్వీ షా ను ఔట్ చేసి ఢిల్లీ షాక్ ఇచ్చాడు ఆర్చర్. ఇక ఆ వెంటనే తాను వేసిన రెండో ఇవర్లో మరి ఆటగాడు రహానెను కూడా పెవిలియన్ చేర్చాడు ఆర్చర్. కానీ ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అలాగే మరో ఓపెనర్ శిఖర్ ధావన్ కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దరు. ఈ క్రమంలో ధావన్ 33 బంతుల్లో 57 పరుగులకు ఆ వెంటనే అయ్యర్ 43 బంతుల్లో 53 పరుగులు చేసి వెనుదిరిగారు. ఇక ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ ఎవరు చివర్లో రాణించకపోవడంతో ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఇక రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు, జయదేవ్ ఉనద్కట్ 2 వికెట్లు, కార్తీక్ త్యాగి, శ్రేయాస్ గోపాల్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. అయితే ఈ మ్యాచ్ లో విజయం సాధించాలంటే రాయల్స్ 162 పరుగులు చేయాలి. అయితే ఈ జట్టు హిట్టర్ సంజు సామ్సన్ ఒక్కసారి అందుకుంటే ఈ లక్ష్యం వారికి చిన్నది అవుతుంది. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఎవరి విజయం సాధిస్తారు అనేది.
previous post