telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరం అగ్నిప్రమాద బాధిత కుటుంబాలను ఆదుకుంటాము: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాద ఘటన కలచి వేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా సీఎం స్పందిస్తూ  ఈ ఘోర ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు.

ప్రమాద కారణాలు, ప్రస్తుత పరిస్థితి, సహాయక చర్యలు, వైద్య సాయంపై అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు.

స్వయంగా సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఉన్నతాధికారులను ఆదేశించామన్నారు.

క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని సూచించామని బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇస్తూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు

Related posts