telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

పంచాయతీ ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ కీలక ఆదేశాలు…

Nimmagadda ramesh

ఎన్నికల నిర్వహణపై మనసు మార్చుకోవాల్సింది ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను కలిసి కోరేందుకు పంచాయతీ రాజ్‌ అధికారులు సిద్ధం అవుతోన్న సమయంలో.. మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు నిమ్మగడ్డ… ఇద్దరు ఐఏఎస్‌లు, ఒక ఐపీఎస్‌ను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వమించే దిశగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది ఎస్‌ఈసీ..  గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లను బదిలీ చేసిన ఎస్‌ఈసీ.. తిరుపతి అర్బన్‌ ఎస్పీ, పలమనేరు డీఎస్పీ, శ్రీకాళహస్తి డీఎస్పీ, మంచిర్యాల, పుంగనూర్‌, రాయదుర్గం, తాడిపత్రి సర్కిల్ ఇన్‌స్పెక్టర్లను విధుల నుంచి తప్పించాల్సిందిగా సూచించింది. గత ఏడాది మార్చిలో ఇచ్చిన ఆదేశాలను వెంటనే అమలు చేయాలని ఎస్‌ఈసీ ఆదేశించింది.. గతంలో విధులు సరిగా నిర్వర్తించని అధికారులపై చర్యలకు సూచించింది ఎస్‌ఈసీ.. మొత్తంగా 9 మంది అధికారులను ఎన్నికల విధుల నుంచి ఎస్ఈసీ తొలగించింది. గుంటూరు, చిత్తూరు కలెక్టర్లను బదిలీ చేస్తూ ఎస్ఈసీ ప్రొసీడింగ్స్ జారీ చేసింది. తిరుపతి అర్బన్ ఎస్పీ, పలమనేరు, శ్రీకాలహస్తి డీఎస్పీలను కూడా ఎస్ఈసీ తొలగించింది. అంతేకాకుండా మాచర్ల, పుంగనూరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐలను తొలగిస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. తొలగించిన అధికారుల స్థానంలో కొత్త అధికారుల పేర్లు పంపాలని ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts