telugu navyamedia
ఆంధ్ర వార్తలు

వైసీపీ రాజ్య‌స‌భ రేసులో ఆర్‌,కృష్ణ‌య్య‌..

*వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ఖ‌రారు..
*రెండు బీసీ, రెండు సామాజిక వ‌ర్గాల‌కు అవ‌కాశం..
*విజ‌య‌సాయిరెడ్డికి మ‌రోసారి అవ‌కాశం..
*నీరంజ‌న్‌రెడ్డికి వైసీపీ అవ‌కాశం..

*తాడేప‌ల్లి సీఎం క్యాంపు ఆఫీస్‌లో ఆర్‌,కృష్ణ‌య్య
*మ‌ధ్యాహ్నాం మూడు గంట‌ల‌కు సీఎం జ‌గ‌న్‌తో భేటి కానున్న ఆర్‌,కృష్ణ‌య్య‌..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణమాం చోటు చేసుకునే అవకాశం ఉంది. ఏపీలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్య‌స‌భ సీట్ల‌కు అభ్య‌ర్థులు దాదాపు ఖారారు అయ్యింది.

రాజ్యసభ అభ్యర్థుల విషయానికి వస్తే.. వైసీపీలో కీలక నేతగా ఉన్న విజయసాయి రెడ్డిని మరోసారి కొనసాగించాలనే ఇప్పటికే సీఎం జగన్ నిర్ణయించారు. దీంతో మిగిలిన మూడు స్థానాల్లో లాయర్ నిరంజన్ రెడ్డి, బీద మనస్తాన్ రావు, కిల్లి కృపారాణి రేసులో ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే వైసీసీ రాజ్యసభ అభ్యర్థుల జాబితాలో.. అనుహ్యంగా బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పేరు తెరపైకి వచ్చింది.

ఈ నేప‌థ్యంలో కృష్ణయ్య మంగళవారం ఉదయం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు.

అయితే, సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం గ్రీన్‌కో పునరుత్పాదనక విద్యుత్‌ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేసేందుకు కర్నూలుకు వెళ్లారు. అక్కడి నుంచి సీఎం జగన్ రాగానే మ‌ధ్యాహ్నాం మూడు గంట‌ల‌కు ఆర్.కృష్ణయ్య భేటీ కానున్నారు.

ఆర్.కృష్ణయ్యతో పాటు నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావుకు కూడా సీఎంవో నుంచి పిలుపువచ్చింది. దీంతో ఆయన కూడా సీఎం కార్యాలయానికి చేరుకున్నారు.

గ‌తంలో ఎల్బీన‌గ‌ర్‌లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్ర‌స్తుతం బీసీ సంఘం నేత‌గా ఉన్నారు. ఈ సంద‌ర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీలు సీఎంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఈ స్థాయిలో బీసీలకు పదవులు కేటాయించలేదని అన్నారు. సీఎం జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెద్దపీట వేస్తున్నారని చెప్పారు.

Related posts