telugu navyamedia
YCP ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అమర్నాథ్ వ్యాఖ్యలపై ఎంపీ శ్రీభరత్ మండిపాటు – వైసీపీ నేతలు దిగజారిన రాజకీయాలు చేస్తారని విమర్శ

 ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌, తమను విడదీసేలా వైసీపీ నేతలు  కుయుక్తులు పన్నుతున్నారని తెలుగుదేశం విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్  ఆరోపించారు.

బాలకృష్ణకు, మెగా ఫ్యామిలీకి మధ్య వైరుధ్యం ఉన్నట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవాళ(శనివారం) విశాఖపట్నం వేదికగా ఏబీఎన్‌తో ఎంపీ శ్రీభరత్ మాట్లాడారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాటల వల్లే 95 వేల ఓట్లతో ఓడిపోయారని విమర్శించారు ఎంపీ శ్రీభరత్.

అమర్నాథ్ ఆరోపణలపై స్పందించాలంటే తనకు అవమానంగా ఉంటుందని ఎంపీ శ్రీభరత్ చెప్పుకొచ్చారు. డిగ్నిటీ లేకుండా మాట్లాడితే తాము సమాధానం ఇవ్వలేమని తెలిపారు.

గుడివాడ అమర్నాథ్ దిగజారి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అమర్నాథ్ లాగా తాము దిగజారి మాట్లాడమని పేర్కొన్నారు. దిగజారి మాట్లాడేవాళ్లను జగన్ ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు.

కేవలం కుల సమీకరణాల కోసమే గత వైసీపీ ప్రభుత్వం డిప్యూటీ ముఖ్యమంత్రి పదవులను ఇచ్చారని ఆక్షేపించారు.

గతంలో పదవులను ఇచ్చారు తప్పా అధికారాలను జగన్ ఇవ్వలేదని విమర్శించారు. సింగపూర్‌తో చంద్రబాబుకు ఉన్న గత పరిచయాల వల్ల ఏపీలో పెట్టుబడులు వస్తున్నాయని ఉద్గాటించారు.

ఏపీ ప్రజలకు తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్వేచ్ఛ దొరికిందని ఎంపీ శ్రీభరత్ పేర్కొన్నారు.

Related posts