telugu navyamedia
YCP ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

డ్రైవర్ హత్య కేసు: అనంతబాబుకు హైకోర్టులో చుక్కెదురు – పునర్విచారణకు గ్రీన్ సిగ్నల్

డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హతమార్చి డోర్ డెలివరీ చేసిన కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో చుక్కెదురైంది.

ఈ కేసును పునర్విచారణ చేయాలని రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.

రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ కేసు పునర్విచారణ చేసుకోవచ్చని హైకోర్టు స్పష్టతనిచ్చింది.

కాగా, ఈ కేసును పునర్విచారణ చేయాలని రాజమండ్రి కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో నిన్న సవాలు చేస్తు ఎమ్మెల్సీ అనంతబాబు పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.

అనంతబాబు పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు.. స్టే కు నిరాకరించడంతో ఈ కేసు పునర్విచారణకు అడ్డంకులు తొలగిపోయాయి.

ఇలా ఉండగా, ఎమ్మెల్సీ అనంతబాబుకు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో ఏపీ ప్రభుత్వం SIT ఏర్పాటు చేసింది. దీంతో SIT అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

అనంతబాబుకు సహకరించిన వారిపై SIT ఫోకస్ పెట్టింది. 90 రోజుల్లో విచారణ పూర్తి చేసే యోచనలో ఉంది. డ్రైవర్‌ను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు నిందితుడుగా ఉన్నారు.

Related posts