telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు వార్తలు

జనవరి 18 సోమవారం దినఫలాలు : క్రీడ, కళాకారులకు ప్రోత్సాహం

మేషం : ఆర్థిక లాభాలు పెరుగుతాయి. కొత్త మార్పులకు అనుకూలిస్తాయి. ఆత్మస్థైర్యం, పనితీరు బాగా పెరుగుతాయి. అత్యవసర పనులు త్వరగా పూర్తిచేసుకోండి. ఆధ్యాత్మికసేవా కార్యక్రమాల పట్ల ధ్యాస వహిస్తారు. పట్టుదలతో అనుకున్నది సాధించి విమర్శలకులకు ధీటుగా నిలుస్తారు. నూతన ప్రణాళికలు అమలు చేస్తారు.

వృషభం : విద్యార్థులలో మానసిక ప్రశాంతత చోటుచేసుకుంటుంది. ప్రయాణాలలో మెళకువ వహించండి. వ్యాపారాల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. మీ సమర్థతపై భాగస్వామికులకు నమ్మకం కలుగుతుంది. మీ సంతానంపై దృష్టిసారిస్తారు. ప్రతి విషయంలోనూ స్వయం శక్తినే నమ్ముకోవడం ఉత్తమం.

మిథునం : కోర్టు వ్యవహారాలు, భూ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. సన్నిహితులతో కీలకమైన విషయాలు చర్చలు జరుపుతారు. ప్రముఖుల కలయిక సాధ్యంకాదు. రుణయత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు. భాగస్వామిక చర్చలు వాయిదా వేయవలసి వస్తుంది. చేతివృత్తుల వారికి ఆశాజనకం.

కర్కాటకం : వృత్తుల వారి శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. నూతన వ్యాపారాలు, లీజు, ఏజెన్సీలకు సంబంధించిన వ్యవహారాల్లో ప్రతికూలతలు ఎదురవుతాయి. రాబడికి తగినట్టుగా ఖర్చులు ఉంటాయి. అందువల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు.

సింహం : ఉద్యోగస్తులు పనితీరుకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. విద్యార్థులు తమ లక్ష్య సాధనకు బాగా కృషి చేయాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. దూర ప్రయాణాలలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. నిరుద్యోగులకు నిరుత్సాహం తప్పదు.

కన్య : ఆర్థిక స్థితి కొంత మెరుగుపడుతుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. విద్యార్థులకు పురోభివృద్ధి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు తప్పవు. ప్రముఖుల కలయిక వల్ల మీ సమస్యలు పరిష్కార మార్గంలో నడుస్తాయి. మీ వ్యక్తిగత భావాలకు మంచి స్ఫురణ లభిస్తుంది. దూర ప్రయాణాలలో చికాకులు తప్పవు.

తుల : ఉద్యోగస్తులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. కొత్త సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. మెలకువ వహించండి. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు అనుకూలించగలవు. ఏజెంట్లకు, బ్రోకర్ల శ్రమకు ఫలిస్తుంది. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. మీ సృజనాత్మకశక్తికి, తెలివితేటలకు గుర్తింపు లభిస్తుంది.

వృశ్చికం : బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళకువ అవసరం. పాత మిత్రులను కలుసుకుంటారు. మీ సంతానం వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. క్రయ విక్రయాలు సమాన్యంగా ఉంటాయి. నూతన వ్యాపారానికి కావలసిన పెట్టుబడిని సమకూర్చుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత ఎంతో ముఖ్యం.

ధనస్సు : పండ్లు, కొబ్బరి, పూల, కూరగాయ వ్యాపారులకు, స్టాకిస్టులకు కలిసిరాగలదు. క్రీడ, కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుంది. రుణ విముక్తులు కావడానిక చేసే యత్నాలు ఫలిస్తాయి. బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళకువ వహించండి. వాహనం నిదానంగా నడపడం క్షేమదాయకం హామీలు, చెక్కులిచ్చే విషయంలో జాగ్రత్త అవసరం.

మకరం : చిన్నారుల విషయంలో పెద్దలగా మీ బాధ్యతలను నిర్వహిస్తారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో జయం పొందుతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. మీ పాత సమస్యలు పరిష్కార దిశగా పయనిస్తాయి. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత తప్పదు.

కుంభం : శ్రీవారు, శ్రీమతి విషయాలలో శుభపరిణామాలు సంభవం. ప్రయాణాల్లో తొందరపాటుతనం అంత మంచిదికాదని గమనించండి. మీ మంచి కోరుకునేవారు కంటే మీ చెడును కోరేవారే ఎక్కువగా ఉన్నారు. సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరనీ ఆకట్టుకుంటారు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు.

మీనం : ఆర్థిక లావాదేవీలు, మధ్యవర్తిత్వాలు సమర్థంగా నిర్వహిస్తారు. దంపతుల మధ్య కలహాలు తొలగిపోతాయి. మిమ్మల్ని ఉద్రోకపరిచి కొంతమంది లాభపడటానికి యత్నిస్తారు. జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులు ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. విదేశీయానం కోసం చేసే యత్నాలు కలిసివస్తాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు.

Related posts