telugu navyamedia
రాజకీయ

గుండెపోటుతో బీజేపీ నాయకురాలు, టిక్‌టాక్‌ స్టార్‌ సోనాలి హఠాన్మరణం..

హర్యానా బీజేపీ నాయకురాలు, నటి సోనాలి ఫోగట్ (43) గుండె పోటుతో హఠాన్మరణం చెందారు. గత రాత్రి తీవ్ర గుండెపోటు కారణంగా ఆమె ఆకస్మిక మృతి చెందినట్లు తెలుస్తోంది.

Sonali Phogat dies: बचपन में अभिनेत्री बनने का सपना रखती थीं सोनाली फोगाट,  टिकटॉक स्टार बन बटोरी चर्चा, Sonali Phogat dreamed of becoming an actress  in childhood, became a Tiktok star

సోనాలి తన సిబ్బందితో కలిసి గోవాకు వెళ్లిన సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. హిందీ బిగ్ బాస్ 14 కంటెస్టెంట్ గా ఆమె ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు.

BJP leader Sonali Phogat dies of heart attack in Goa | Deccan Herald

ఏక్ మా జో లాఖన్ కే లియే బని అమ్మ’ అనే టీవీ సీరియల్ లో 2016లో మొదటిసారిగా సోనాలి నటించింది. ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో ఆమె నటించింది. సోనాలికి ఇన్ స్టా గ్రామ్ లో 8.8 లక్షల మంది ఫాలోవర్లు సంపాదించుకున్నారు..దీంతో బీజేపీ ఆమెను స్టార్‌ క్యాంపెయినర్‌గా మార్చేసుకుంది.

ఆమె 2019 అసెంబ్లీ ఎన్నికల్లో హర్యానా నుంచి అడంపూర్ నియోజకవర్గం నుంచి బిజేపి టికెట్ పై ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారిన కుల్దీప్ బిష్ణోయ్ పై పోటీ చేసి ఓడిపోయారు.

Bigg Boss 14' Contestant, Sonali Phogat Passes Away At 41, BJP Leader Died  Due To Heart Attack

పోయినవారం సోనాలి ఫోగట్‌తో బిష్ణోయ్‌ భేటీ కావడంతో.. అదాంపూర్‌ ఉపఎన్నికలో సోనాలినే అభ్యర్థిగా నిలబడతారనే ప్రచారం ఊపందుకుంది. ఈలోపే ఆమె కన్నుమూయడం గమనార్హం.

2016 డిసెంబర్ లో సోనాలి ఫోగట్ భ‌ర్త సంజయ్ ఫోగట్ హిస్సార్‌లోని ఓ ఫామ్‌హౌజ్‌లో అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. సోనాలికి ఒక కుమార్తె ఉంది.

BJP leader Sonali Phogat said this in her last Instagram post before she  died | Latest News India - Hindustan Times

కాగా..ఆమె చనిపోవడానికి కొన్ని గంటల ముందు తన అధికారిక ఇన్ స్టా ఖాతాలో ఓ వీడియో షేర్ చేసుకున్నారు. మొహమ్మద్ రఫీ పాట అయిన రుఖ్ సే జరా నికాబ్ తో హతా దే మేరే హజూర్ సాంగ్ పోస్ట్ చేశారు.

Related posts