*కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి..
*సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అర్జున్ కుమార్తె పుట్టిన రోజు వేడుకలు కోసం గోవా వెళ్లిన స్నేహితులు, కుటుంబసభ్యులు
*మే 29న గోవా వెళ్ళిన ప్రయాణికులు..
*కలబురగి దగ్గర టెంపోను ఢికొన్న ప్రవేటు బస్సు..
కర్ణాటక కలబురగిలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఓ టెంపోను ఢీకొట్టి బస్సు బోల్తాపడగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 8 మందికిపైగా మరణించినట్లు సమాచారం. బస్సులో డ్రైవర్‌తో పాటు మరో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. 12 మందిని రక్షించి ఆస్పత్రికి తరలించారు .మృతులంతా హైదరాబాద్‌కు చెందినవారే..గురువారం ఉదయం 6 గంటల ప్రాంతంలో హుబ్లీ-ధార్వాడ బైపాస్ రోడ్డుపై ఈ ఘోరం జరిగింది.
వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అర్జున్ తన కుమార్తె పుట్టిన రోజు వేడుకలను గోవాలో నిర్వహించారు. తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను మే 29న ఓ బస్సులో గోవాకు తీసుకెళ్లారు. బస్సులో మొత్తం 35 మంది ఉన్నట్లు తెలుస్తోంది. టూర్ ముగిసిన తర్వాత గురువారం రాత్రి గోవా నుంచి వారంతా బయలుదేరారు. బస్సు కర్నాటకలోని కలబురిగి జిల్లా కమలాపుర వద్దకు చేరుకోగానే.. అదుపుతప్పింది.
ఓ టెంపో వాహనాన్ని ఢీకొట్టింది.. ఆ తర్వాత కల్వర్టు ఢీకొట్టి…రోడ్డుకిందకు వెళ్లిపోయింది. అప్పటికే డీజిల్ ట్యాంక్ పగలిపోవడంతో.. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలు తక్కువగా ఉన్న సమయంలో కొందరు డోర్లు, కిటికీల నుంచి దూకేశారు. మరికొందరు మాత్రం తప్పించుకోలేకపోయారు. చూస్తుండగానే కొందరు హాహాకాారాలు చేస్తూ.. మంటల్లోనే సజీవ దహనమయ్యారు. మరో మూడు గంటల్లో వీరంతా హైదరాబాద్‌కు చేరుకోవాల్సి ఉంది. కానీ అంతలోనే ఘోరం జరిగింది.
సమాచారం అందిన వెంటనే. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మరో 25 మందికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన కొందరి పరిస్థితి విషమంగా ఉంది. వారికి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

