*సుబ్రహ్మణ్యం మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి..
*డ్రైవర్ హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కోసం పోలీసులు గాలింపు..
*ఎమ్మెల్సీ అనంతబాబుపై మర్డర్ కేసు..
*కాసేపట్లో అనంతబాబు అంత్యక్రియలు..పోలీసులు భారీ బందోబస్తు..
వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయ్యింది. గత అర్ధరాత్రి కాకినాడ జీజీహెచ్‌లో వైద్యులు.. సుబ్రహ్మణ్యం మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహించారు.
సుబ్రహ్మణ్యం భార్యకు ఆర్థిక సాయంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఇక ఈ హత్య కేసులో పోలీసులు ఉదయభాస్కర్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఎమ్మెల్సీ ఉదయభాస్కర్ అదుపులోకి తీసుకుంటామని అర్ధరాత్రి ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ప్రకటించారు. అనుమానస్పద మృతి కేసు నుంచి హత్య కేసుగా మార్చినట్టుగా వెల్లడించారు. మృతుడి కుటుంబీకుల స్టేట్మెంట్ ఆధారంగా ఉదయ్ భాస్కర్‌ను అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు.
ఎస్పీ ప్రకటన తర్వాత సుబ్రహ్మణ్యం మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహించేందుకు అతడి కుటుంబ సభ్యులు అంగీకరించారు. పోస్టుమార్టమ్ అనంతరం సుబ్రహ్మణ్యం స్వగ్రామం పెదపూడి మండలం జి మామిడాడకు తరలించారు. సుబ్రహ్మణ్యం మృతదేహానికి నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
కాగా.. ప్రత్యేక బృందాలతో అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అనంతబాబును త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
ఒక మన్యం ప్రాంతంలో ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో నేడు ఎమ్మెల్సీ అనంతబాబు ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.