ప్రియుడు రణ్‌బీర్‌తో తనకు ఎప్పుడో పెళ్లి అయిపోయిందనే అలియా భట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ లవ్ బర్డ్స్‌ల్లో ఈ జంట ఒకటి. ఈ లవ్ బర్డ్స్ రణ్‌బీర్ కపూర్ , ఆలియా భట్ కొన్నాళ్లుగా ప్రమేలో మునిగితేలుతున్నారు.
గతేడాది డిసెంబర్‌లో వీరి పెళ్లి జరగాల్సి ఉండగా సినిమాల కారణంగా కొన్నాళ్లు తమ వివాహాన్ని వాయిదా వేసుకున్నారు. ఇక అప్పటి నుంచి ఈ క్యూట్ కపుల్ పెళ్లి కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఈక్ర మంలోనే వీరి పెళ్లిపై రెండేళ్ల నుంచి వరుస కథనాలు పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆలియాభట్.. రణ్‌బీర్‌తో పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ‘గంగూబాయ్ కతియావాడి’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఆలియా.. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నా దృష్టిలో రణబీర్‌తో నా పెళ్లి ఎప్పుడో అయిపోయింది. రణ్‌బీర్ చెప్పింది నిజమే. లాక్‌డౌన్ కారణంగా అప్పుడు పెళ్లి వాయిదా పడింది. కానీ, ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. మంచి సమయం వచ్చినప్పుడు తప్పకుండా మా పెళ్లి జరుగుతుంది” అని ఆమె వెల్లడించింది.