వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా “పవర్ స్టార్” అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. “ఎన్నికల తరువాత కథ” అనేది ఈ చిత్రానికి ట్యాగ్ లైన్. అయితే రామ్ గోపాల్ వర్మపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిర్మిస్తోన్న చిత్రం ‘పరాన్నజీవి’. ‘బిగ్ బాస్’ సీజన్ 2 కంటెస్టెంట్ నూతన్ నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. వర్మ తెరకెక్కిస్తున్న పవర్ స్టార్ సినిమాకు సమాధానంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఫస్ట్ సాంగ్ ను కూడా విడుదల చేశారు. కేవలం మూడు రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది . ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే కొద్దిరోజులుగా ఈ సినిమాలో వివాదాస్పద నటి శ్రీ రెడ్డి నటిస్తుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ వార్తలపై శ్రీ రెడ్డి స్పందించింది. ‘పరాన్నజీవి’ చిత్రంలో నేను నటిస్తున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదు. ఐ లవ్ రామ్ గోపాల్ వర్మ. ఆయనకు వ్యతిరేకంగా తెరకెక్కుతున్న సినిమాలో నేను ఎలా నటిస్తా? అంటూ ప్రశ్నించింది. నన్ను పరాన్నజీవి చిత్రం కోసం సంప్రదించిన మాట వాస్తవం. కాని నేను వర్మకు వ్యతిరేకంగా నటించను అంటూ చెప్పుకొచ్చింది. కాగా పరాన్నజీవి సినిమాలో శ్రీ రెడ్డి పాత్ర కూడా ఉందట. ఆమె పాత్రలో వేరొకరు నటిస్తున్నారని సమాచారం.
previous post