telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“గ్యాంగ్ లీడర్” ట్విట్టర్ టాక్

Gang-Leader

నాని, విక్రమ్.కె.కుమార్ కాంబినేష‌న్‌లో తెరకెక్కిన చిత్రం “గ్యాంగ్ లీడ‌ర్”. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం) నిర్మించారు. ఇందులో ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ కీలక పాత్రను పోషించారు. ప్రియాంక, లక్ష్మి, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఐదుగురు మహిళలకు నాని లీడర్‌గా, స్టోరీ రైటర్‌గా కనిపించబోతున్నాడు. ఇది ఒక రివేంజ్ డ్రామా. మరోసారి విక్ర‌మ్ కే కుమార్ త‌న మార్క్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచంద్రన్ అందించారు. ఈరోజు అంటే సెప్టెంబర్ 13న ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. మనం తర్వాత ఇప్పటి వరకు ఆ స్థాయి బ్లాక్ బస్టర్ లేని విక్రమ్ కే కుమార్.. గ్యాంగ్ లీడర్ సినిమాతో కచ్చితంగా హిట్టు కొట్టాలని భావిస్తున్నాడు. కమెడియన్ వెన్నెల కిషోర్, ఇంటర్వెల్‌ ట్విస్ట్‌, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఈ సినిమాకు హైలెట్. ప్రేక్షకుల హృదయాలను తాకేలా సినిమాను రూపొందించడంలో దర్శకుడు విక్రమ్ కుమార్ సక్సెస్ అయ్యాడనే చెబుతున్నారు. సినిమా ప్రీమియర్ షోలను చూసినవారు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. నాని మరో హిట్టు కొట్టినట్టేనని భావిస్తున్నారు.

Related posts