telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఊర్వశి లో ఉచితంగా “రామ్ లోపాల్ వర్మ” సినిమా…

కొత్తగా వచ్చిన “ఊర్వశి ఓటిటి” విడుదలకు సర్వ సన్నాహాలు చేసుకుంటుండం తెలిసిందే. ఈ నెలాఖరు వరకు ‘ఇనాగురల్ ఆఫర్’గా ఉచిత వినోదం పంచనున్న “ఊర్వశి ఓటిటి”.. ఈ బంపర్ ఆఫర్ లో భాగంగా “రామ్ లోపాల్ వర్మ” చిత్రాన్ని ఉచితంగా చూపించనుంది. ప్రముఖ దర్శకుడు వీరు.కె రూపొందించిన ఈ చిత్రంలో షకలక శంకర్, ఆర్లిన్, డి.ఎస్.రావు, మధురిమ, లక్కీ, ఫిష్ వెంకట్, శశికాంత్, హర్షద పటేల్ ముఖ్య పాత్రలు పోషించారు. చిత్ర రూపకర్త వీరు.కె మాట్లాడుతూ… “ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమవుతున్న “ఊర్వశి ఓటిటి” ఇనాగురల్ ఆఫర్ గా.. “రామ్ లోపాల్ వర్మ” స్ట్రీమింగ్ కానుండడం చాలా సంతోషంగా ఉంది. తెలుగు సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకువెళ్లిన దర్శకుడు ఇప్పుడు.. అదే తెలుగు సినిమా స్థాయిని పాతాళంలోకి తీసుకువెళ్తుండడాన్ని జీర్ణించుకోలేక… సదరు దర్శకుడిపై ఇప్పటికీ గల గౌరవంతో… ఆవేదనతో… అతని లోపాలను ఎత్తి చూపుతూ… అతని పూర్వ వైభవాన్ని కోరుకుంటూ రూపొందించిన చిత్రం “రామ్ లోపాల్ వర్మ. వినోదానికి పెద్ద పీట వేస్తూ.. విమర్శనాత్మకంగా, ఆలోచన రేకెత్తిస్తూ తెరకెక్కిన “రామ్ లోపాల్ వర్మ” అందరినీ కచ్చితంగా ఆకట్టుకుంటుంది” అన్నారు.

Related posts