జగిత్యాల జిల్లా టీఆర్ఎస్ పార్టీ కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఇంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మెట్పల్లిలోని ఎమ్మెల్యే ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
సంక్రాంతి పండుగ పురస్కరించుకుని విద్యాసాగర్ రావు తీమణి సరోజ వంటగదిలో సకినాలు చేస్తున్న సమయంలో గ్యాస్ సిలిండర్ లీక్ అయింది. ఒక్కసారిగా సిలిండర్ నుంచి మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న ఎమ్మెల్యే సతీమణి సరోజకు మంటలు అంటుకున్నాయి.
ఆమె గట్టిగా కేకలు వేయడంతో కుటుంబసభ్యులు వెంటనే స్పందించి మంటలు ఆర్పారు . అప్పడికే గాయపడిన సరోజను చికిత్స నిమిత్తం హుటాహూటినా హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు.
నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమెకు మెరుగైన చికిత్స అందిస్తు్న్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.