telugu navyamedia
తెలంగాణ వార్తలు

సీఎం కేసీఆర్ మూడు టిమ్స్ ఆసుపత్రులకు శంకుస్థాపన

సీఎం కేసీఆర్ హైద‌రాబాద్ న‌గ‌రంలో మూడు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు మంగ‌ళ‌వారం భూమిపూజ నిర్వహించారు.

కొత్త‌పేట ఎల్బీనగర్‌ (గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌), సనత్‌నగర్‌ (ఎర్ర‌గ‌డ్డ చెస్ట్ హాస్పిట‌ల్), అల్వాల్‌ (బొల్లారం)లో నూతనంగా నిర్మించనున్న టిమ్స్‌ భవనాల నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ మంగళవారం శంకుస్థాపన చేశారు.

ఎల్బీనగర్ గ‌డ్డి అన్నారంలో టిమ్స్ ఆస్పత్రికి 21.36 ఎక‌రాల విస్తీర్ణంలో.. 14 అంత‌స్తుల్లో వెయ్యి ప‌డ‌క‌ల ఆస్పత్రిగా నిర్మించ‌నున్నారు. 300 ఐసీయూ బెడ్స్, 16 ఆప‌రేష‌న్ థియేట‌ర్లు ఉండేలా ఆస్ప‌త్రి నిర్మాణం చేప‌ట్ట‌నున్నారు. ఈ మ‌ల్టీ సూప‌ర్‌ స్పె‌షా‌లిటీ హాస్పి‌ట‌ల్‌కు రూ.900 కోట్లు కేటాయించారు.

 హైదరాబాద్‌ పరిధిలో మూడు టిమ్స్‌ ఆస్పత్రులకు కేసీఆర్‌ భూమిపూజ నిర్వహించారు. ఎల్బీనగర్‌ (గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌), సనత్‌నగర్‌ (ఎర్రగడ్డ ఛాతి దవాఖాన), అల్వాల్‌ (బొల్లారం)లో నూతనంగా నిర్మించనున్న టిమ్స్‌ భవనాల నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అల్వాల్‌లో నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు.

రెండోది  అల్వాల్‌లో నిర్మించనున్న టిమ్స్ ఆసుపత్రి కోసం రూ.897 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. 28.41 ఎకరాల్లో జీ ప్లస్ 5 అంతస్తుల్లో ఈ భవనం రూపుదిద్దుకోనుంది.

మూడోదిసనత్‌నగర్‌ చెస్ట్ ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మించనున్న వేయి పడకల టిమ్స్ ఆస్ప‌త్రి 17 ఎకరాల్లో రూ. 882 కోట్లతో జీ+ 14 అంతస్తులతో టిమ్స్ భవనాన్ని నిర్మించనున్నారు. మొత్తం ఈ మూడు ఆస్పత్రులు రూ.2,679 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపడుతున్నారు. 

Related posts