నిజమాబాద్ జిల్లా పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా సిబ్బంది సహకారం తో ముందుకు సాగుతామని కొత్త పోలీస్ కమిషనర్ నాగరాజు తెలిపారు. నిజామాబాద్ పోలీసు కమిషనర్ గా ఐపీఎస్ అధికారి నాగరాజు బాధ్యతలు చేపట్టారు. అరు సంవత్సరాలుగా సీపీ గా విధులు నిర్వహిస్తున్న కార్తికేయకు స్థాన చలనం కల్పించారు.
దీంతో నిజామాబాద్ కు కొత్త కమిషనర్ నాగరాజు ఆదివారం సాయంత్రం పాత కమిషనర్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఆరు సంవత్సరాల వ్యవధిలో నిజామాబాద్ తో ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని ఇప్పటిదాకా పోలీస్ కమిషనర్ గా సేవలు అందించిన కార్తికేయ అభిప్రాయం వ్యక్తంచేశారు.
తన విధినిర్వహణలో ప్రజలు, ప్రజాప్రతినిధులు సహాయ సహకారాలు అందించారని గుర్తుచేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో పాటు కరోనా సమయంలో సిబ్బంది, ప్రజల సహకారంతో పోలీసు విభాగం అద్భుతంగా పనిచేసిందని తెలిపారు.