సీబీఎస్ఈ టెన్త్ ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. విద్యార్థులు cbseresults.nic.in, cbse.gov.in, cbse.nic.in వెబ్ సైట్లలో ఫలితాలు చూసుకోవచ్చు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో విద్యార్థులు ఇంటర్నల్ అసెస్మెంట్, అర్ధ సంవత్సరం లేదా మధ్యంతర పరీక్షలు, ప్రీ-బోర్డ్ పరీక్షలలో పనితీరు ఆధారంగా విద్యార్థులకు మార్కులు కేటాయించారు. గత వారంలో 12 వ తరగతి ఫలితాలను వెల్లడించగా..రికార్డు స్థాయిలో 99.37 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
previous post
next post