telugu navyamedia
విద్యా వార్తలు

తెలంగాణ ఎంసెట్, ఈసెట్ నోటిఫికేషన్‌లు విడుదల..

తెలంగాణలో ఎంసెట్-2022, ఈసెట్-2022 ప్రవేశపరీక్షలకు నోటిఫికేషన్‌లను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది.ఈ ఏడాది ఏప్రిల్ 6 నుండి మే 28వ తేదీ వరకు స్వీకరించనున్నారు..

ఈ ఏడాది జూలై 14, 15 జూలై 14, 15 తేదీల్లో ఎంసెట్ ఆగ్రి క‌ల్చ‌ర్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. జూలై 18,19,20 తేదీల్లో ఎంసెట్ ఇంజ‌నీరింగ్‌ పరీక్షలు నిర్వహిస్తారు. .ఎంసెట్ పరీక్ష కోసం దరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్థులు అయితే రూ.800.. ఎస్సీ, ఎస్టీలు అయితే రూ.400 చెల్లించాల్సి ఉంది.

అటు ఈ సెట్ పరీక్షల నోటిఫికేషన్ కూడా విడుదల అయింది. జులై 13 న ఎంట్రెన్స్ జరుగన్నట్లు స్పష్టం చేసింది తెలంగాణ విద్యాశాఖ. ఈ నోటిఫికేషన్‌ ప్రకారం.. ఏప్రిల్ మాసం 6 నుండి జూన్ 8 వరకు ఆన్లైన్ దరఖాస్తులు జరుగనున్నాయి. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది తెలంగాణ విద్యాశా.

ఎంసెట్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ ను ఈ నెల 23వ తేదీన తెలంగాణ ఉన్నత విద్యా మండలి విడుదల చేసిన విషయం తెలిసిందే.

.

Related posts