telugu navyamedia
ఆరోగ్యం

కన్నీటి ద్వారా కరోనా వ్యాప్తి!

మ‌నిషి దగ్గిన‌పుడు, తుమ్మిన‌పుడు నోటి నుంచి తుంప‌ర్లు ద్వారా కరోనా సోకుతుంది అని మాత్రమే మనకు తెలుసు. క‌రోనా సోకిన వ్యక్తి శ‌రీరంలో క‌రోనా ఉంటే అది ముక్కు, నోటిద్వారా బ‌య‌ట‌కు వ‌స్తుంటాయి. అక్క‌డి నుంచి మ‌రోక‌రికి సోకుతుంటాయి. అయితే, పంజాబ్‌లోని అమృత్‌స‌ర్ ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీ ఆసుపత్రిలో క‌రోనా రోగుల‌కు చికిత్స అందించే క్ర‌మంలో వైద్యులు స‌రికొత్త విష‌యాల‌ను గుర్తించారు. కరోనా రోగుల కన్నీటి ద్వారా కూడా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశమున్నదని అమృత్‌సర్‌లోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఓ అధ్యయనంలో వెల్లడించింది. కండ్లకలక వల్ల కంటి నుంచి వచ్చే స్రావాల్లో సార్స్‌-కొవ్‌-2 ఉన్నట్టు గుర్తించామని పరిశోధకులు తెలిపారు. 120 మంది రోగులపై చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైనట్టు చెప్పారు. కరోనా సోకిన రోగులకు చికిత్స అందిస్తున్నప్పుడు నేత్ర వైద్యులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అయితే, నోటి తుంపర్ల ద్వారానే వైరస్‌ ఎక్కువగా వ్యాపిస్తున్నట్టు గుర్తుచేశారు.

Related posts