ఏపీలో కరోనా ఉధృతి మళ్ళీ పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 17 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రంలో 80,712 శాంపిల్స్ పరీక్షించగా 4,684 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లోనే కోవిడ్‌తో 36 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇదే సమయంలో 7,324 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,62,036 కి చేరగా.. యాక్టివ్ కేసులు 51,204 గా ఉన్నాయి.. ఇక, ఇప్పటి వరకు 17,98,380 కరోనా నుంచి కోలుకోగా 12,452 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో చేసిన మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 2,13,61,014 కు చేరింది.
							previous post
						
						
					
							next post
						
						
					


కోమటిరెడ్డి అందుకే పార్టీ మారుతున్నారు.. ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు