ప్రస్తుతం మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ లో కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. అయితే ఏ వైరస్ కు ఈ ఏడాది ఆరంభం నుండి వ్యాక్సిన్ అందిస్తుంది ప్రభుత్వం. అయితే ప్రస్తుతం భారత్ లో కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ప్రజలకు అందిస్తున్నారు. అయితే, ఇప్పుడు మూడో వ్యాక్సిన్ కూడా ఇండియాలో అందుబాటులోకి వచ్చింది.. రష్యా కు చెందిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ కూడా మే 1 నుంచి దేశంలో అందుబాటులో ఉన్నది. అయితే, ఈ వ్యాక్సిన్ ను ఇంకా ఎవరికీ అందించలేదు. ఈ వ్యాక్సిన్ డోస్ ధరను తాజాగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ప్రకటించింది. ఎమ్మార్పీ రూ.948 జీఎస్టీతో కలుపుకొని 995.40 గా నిర్ణయించారు. వచ్చే నెలలో మరికొన్ని వ్యాక్సిన్ డోసులు ఇండియాకు రాబోతున్నాయని రెడ్డీస్ ల్యాబ్స్ తెలిపింది. ఇండియాలో ఉత్పత్తి ప్రారంభమైతే ఈ ధర తగ్గిపోతుందని రెడ్డీస్ ల్యాబ్స్ తెలియజేసింది. చూడాలి మరి ఈ ధర ఎప్పటికి తగ్గుతుంది అనేది.
previous post
next post

