73 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్రోద్యమాన్ని స్మరించుకోవడంతో పాటు దేశ అభ్యు న్నతికి పునరంకితం కావాల్సిన రోజన్నారు. స్వాతంత్య్రసమరంలో ప్రాణాలర్పించిన త్యాగధనుల జీవితాలను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పేర్కొన్నారు. దేశాన్ని బ్రిటిష్ దాస్య శృంఖలాల నుంచి విముక్తి కలిగించటానికి కడవరకు పోరాడినవారిని స్మరించుకోవడం అందరి కర్తవ్యమని చెప్పారు. జాతిని నడిపి, నీతిని నిలిపిన మహనీయులను మరువరాదని గవర్నర్ తన సందేశంలో పేర్కొన్నారు.ఎన్నో తరాల దేశ భక్తుల నిస్వార్థ పోరాటాలు, త్యాగాల ఫలితంగానే మనకు స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు.
నేడు రాజ్‌భవన్‌లో రక్షాబంధన్ వేడుకలు:
రాజ్‌భవన్‌లోని దర్బార్ హాలులో గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రక్షాబంధన్ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకల్లో సాధారణ ప్రజలు పాల్గొనవచ్చని రాజ్‌భవన్ అధికారులు తెలిపారు. గవర్నర్ నరసింహన్ దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
జగన్ నవరత్నాలు పంచుతాడో లేదో చూస్తా: కేఏ పాల్