ఏపీ ఎమ్యెల్యే రోజాకు సిఎం కెసిఆర్ ఫోన్ చేశారు. ఈ సందర్బంగా ఎమ్యెల్యే రోజా ఆరోగ్య పరిస్థితిపై కెసిఆర్ ఆరా తీశారు. నెల రోజుల క్రితం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమె సర్జరీలు చేయించుకున్నారు. వైద్యుల సూచనల మేరకు చెన్నైలోని తన నివాసంలో రోజా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు ఫోన్ చేసి పరామర్శించారు సిఎం కెసిఆర్. త్వరగా ఎమ్యెల్యే రోజా కొలుకోవాలని ఆకాంక్షించారు. రోజా కుటుంబ సభ్యుల యోగక్షేమలను సిఎం కెసిఆర్ తెలుసుకున్నారు. సిఎం కెసిఆర్ ఫోన్ చేయడంపై ఎమ్యెల్యే రోజా ఆనందం వ్యక్తి చేశారు. కాగా ఇటీవలే సీఎం కేసీఆర్ కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం కెసిఆర్ ఆరోగ్యం కాస్త మెరుగుపడింది. సీఎం కేసీఆర్కు కరోనా సోకిన తర్వాత మంత్రి కేటీఆర్, ఎంపి సంతోష్ కుమార్ కు కరోనా సోకడం అందరిలో ఆందోళన కలిగించే విషయం.
previous post
చిన్న లొల్లి అని చెప్పడం కేసీఆర్కు సిగ్గుచేటు: ఎంపీ సంజయ్