గుంటూర్ జిల్లాలోని రేపల్లెలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం హత్యకు దారి తీసింది. వివహేతర సంబంధం కారణంగా గత అర్ధరాత్రి భార్య సౌజన్యపై భర్త వీరేంద్ర కత్తితో దాడి చేసి హత్యచేశాడు. అనంతరం భర్త కూడా పురుగుల మందు తాగి నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.
పురుగుల మందు తాగిన వీరేంద్రను పోలీసులు వెంటనే తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తన భార్య సౌజన్య, బైరావ్ అనే వ్యక్తితో సన్నిహితంగా ఉన్న సమయంలో హత్య చేశానని భర్త వీరేంద్ర చెప్పుకొచ్చాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.