telugu navyamedia
క్రీడలు వార్తలు

సన్‌రైజర్స్ ఆటగాళ్ల ఉగాది శుభాకంక్షాలు…

ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా ఐపీఎల్ ప్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు అందరూ అభిమానులకు శుభాకంక్షాలు తెలిపారు. ఈ మేరకు సన్‌రైజర్స్ ఓ వీడియో రూపొందించి తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘మాతో పాటు మా కుటుంబం నుంచి కూడా మీకు హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు’ అని సన్‌రైజర్స్ హైదరాబాద్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పంచుకుంది. వీడియోలో ప్రతిఒక్క ప్లేయర్ కూడా అభిమానులకు ఉగాది శుభాకంక్షాలు చెప్పారు. కెప్టెన్ డేవిడ్ వార్నర్, ఖలీల్ అహ్మద్, విజయ్ శంకర్, జాసన్ హోల్డర్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, కేన్ విలియమ్సన్, జానీ బెయిర్‌స్టో సహా అందరూ ‘ఉగాది శుభాకంక్షాలు’ అని చెప్పారు. మన హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్ తప్పితే.. మిగతావారు చెప్పింది వింటే కాస్త నవ్వు వస్తుంది. ‘శుభాకంక్షాలు’ అని చెప్పడానికి వారు కాస్త కష్టపడ్డారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. ఐపీఎల్ 2021 కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ప్రస్తుతం చెన్నైలో ఉంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో బుధవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును సన్‌రైజర్స్ ఢీకొనబోతోంది.

Related posts