కెరీర్ తొలి టెస్టు గబ్బా మైదానం లో వాషింగ్టన్ సుందర్ చేసిన ప్రదర్శన అతనికి జీవితకాలం గుర్తుండిపోతుంది. ఆసీస్ పర్యటనలో భాగంగా గబ్బా టెస్ట్ ద్వారా వాషింగ్టన్ సుందర్ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగులు చేసిన సుందర్… శార్దుల్‌తో కలిసి ఆరో వికెట్‌కు 123 పరుగులు జోడించాడు. సుందర్ తన తొలి మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో కీలకమైన 62 పరుగులు మాత్రమే కాకుండా రెండో ఇన్నింగ్స్‌లో 22 పరుగులు అలాగే ఆ మ్యాచ్ లో నాలుగు వికెట్లు తీసాడు. అయితే అరంగేట్ర మ్యాచ్‌తోనే అతడు పెద్ద హీరో అయిపోయాడు. అయితే వాషింగ్టన్ సుందర్.. కుక్క పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతడు తన పెంపుడు కుక్కను పరిచయం చేస్తూ.. దాని పేరును చెప్పడమే దీనికి అసలు కారణం. తన ముద్దుల కుక్కకు ‘గబ్బా’ అని పేరు పెట్టుకున్నాడు. అంతేకాదు మంచి కాప్షన్ పెట్టి అభిమానులకు దానిని పరిచయం చేశాడు. ‘ప్రేమ అనేది నాలుగు కాళ్ల పదం. గబ్బాను పరిచయం చేసుకోండి’ అంటూ కుక్క ఫొటో పోస్ట్ చేశాడు. సుందర్ భారత్ తరఫున 4 టెస్టులు, ఒక వన్డే, 31 టీ20లు ఆడాడు. ప్రస్తుతం వాషింగ్టన్ సుందర్ ఐపీఎల్ 2021 కోసం ఎదురుచూస్తున్నాడు.
previous post
next post