telugu navyamedia
రాజకీయ వార్తలు

అమర జవాన్ల త్యాగాలను వృథా పోనివ్వం: ప్రధాని మోదీ

modi first step on black money

సరిహద్దుల్లో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఇదే సమయంలో చైనా సైనికులు దాదాపు 45 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను భారత్ సీరియస్ గా తీసుకుంది. మన జవాన్ల త్యాగాలను వృథా పోనివ్వమని అన్నారు.

దేశ సార్వభౌమాధికారం, ఐక్యతే తమకు ప్రధానమని చెప్పారు.ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని అన్నారు. రెచ్చగొడితే మాత్రం దీటుగా సమాధానం చెపుతామని హెచ్చరించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే సత్తా భారత్ కు ఉందని అన్నారు.చైనీయులతో పోరాడుతూ దేశం కోసం ప్రాణాలను అర్పించిన వీరులను చూసిన యావత్ దేశం గర్విస్తోందని మోదీ చెప్పారు.

Modi BJP China Soldiers India

Related posts