telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

అన్ని శాఖల తరలింపుకు ఏర్పాట్లు .. సచివాలయం కూల్చివేతకు నిర్ణయం!

secretariate telangana

నూతన సచివాలయాన్ని నిర్మించనున్న తెలంగాణ సర్కారు ఇప్పుడున్న సచివాలయాన్ని కూల్చివేతకు చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. భావిస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయగా, ఉపసంఘందే తుది నిర్ణయమని తెలుస్తోంది. భవంతుల పునాదుల నుంచి అన్ని అంతస్తుల పిల్లర్లను డ్రిల్ చేసి, డైనమైట్లను అమర్చి కూల్చివేయనున్నారు.ఇలా కంట్రోల్ బ్లాస్టింగ్ పద్ధతిలో కూల్చివేస్తే చుట్టుపక్కల ఉన్న ఇతర భవనాలకు ఏ విధమైన నష్టమూ కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.

తెలంగాణ నూతన సచివాలయం డిజైన్లు ప్రస్తుతం తుది రూపును సంతరించుకుంటున్నాయి. వీటిని సాధ్యమైనంత త్వరగా ఖరారు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. సెక్రటేరియేట్ లో మొత్తం 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలుండగా, ఒక్కో భవనం ఒక్కో బ్లాక్ గా మొత్తం 10 వున్నాయి. వీటిల్లో జీ-బ్లాక్ గా ఉన్న సైఫాబాద్ ప్యాలెస్ అన్నిటికన్నా పాతది కాగా, మంత్రులున్న డీ-బ్లాక్ భవనం కొత్తది. ఆయా బ్లాకుల్లో ఉన్న అన్ని కార్యాలయాలనూ మరో చోటకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా సచివాలయం ఎదురుగానే ఉండే బూర్గుల రామకృష్ణారావు భవనంతో పాటు మరికొన్నింటిని ఎంపిక చేశారు. మరో రెండు వారాల్లో అన్ని శాఖల తరలింపు పూర్తవుతుందని తెలుస్తోంది.

Related posts