వెన్నెలమ్మ పదాలు
—————-
కష్టపడితే గెలుపు
జీవితానికి మలుపు
ఇదే చరిత్ర తెలుపు
ఓ వెన్నెలమ్మ!
చురుకుదనమే సొంపు
మంచితనమే ఇంపు
చెడ్డతనమే కంపు
ఓ వెన్నెలమ్మ!
వట్టి మాటలు వద్దు
గట్టి చేతలు ముద్దు
బ్రతుకులో తొలిపొద్దు
ఓ వెన్నెలమ్మ!
దైవ సన్నిధి వెదుకు
ధన్యకరమగు బ్రతుకు
శాంతి దొరుకును తుదకు
ఓ వెన్నెలమ్మ!
======================
ఎక్కడని…
——————-
మెరిసే తారక నడిగాను
నా మనోగగనాన వెలిగిన
ప్రేమ తారక ఎక్కడని..
పూసే పూవు నడిగాను
గుబాళించు చేమంతి చెలి ఎక్కడని…
కురిసే చినుకు నడిగాను
అధరాల అమృతపు జల్లులు
వెదజల్లు సఖి ఎక్కడని…
నా గుండె గుడిలో ప్రేమదీపమై వెలుగుతుందని.
నా కనుల ఉయ్యాలో
కనుపాపయై,పసిపాపయై
పవళిస్తుందని…
నా నాసికలో శ్వాసయై
నిలిసిందని….
సామూహికంగా సమాధానమిచ్చాయి
-గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు
రజినీకాంత్ ఆరోగ్యంపై కమల్ హాసన్ కామెంట్స్