స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమాలో లక్కీ బ్యూటీ రష్మిక హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఓ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో చేయనున్నారట. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్లో రూపొందిస్తున్నారు సుకుమార్. అంతేకాదు అల్లు అర్జున్ ఈ మూవీలో సరికొత్త లుక్స్‌తో ఆకట్టుకోనున్నారు. ఇందుకోసం అల్లు అర్జున్ తెగ కష్టపడుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమా షూటింగ్‌ను రాజమండ్రి సమీపంలోని మారేడుమిల్లి అడవుల్లో చిత్రీకరణ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమా విషయంలో సుకుమార్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడట. ప్రస్తుతం తెరకెక్కిస్తున్న పుష్ప సినిమాను కూడా రంగస్థలం తరహాలో ప్రత్యేక సెట్ వేసి షూట్ చేయాలని సుకుమార్ భావిస్తున్నాడట. అటవీ ప్రాంతాల్లో షూటింగ్ స్పీడ్ గా జరగకపోవడంతో ఇలా సెట్ ఆలోచన చేస్తున్నాడని టాక్. రంగస్థలం కు కూడా ఇలాగే హైదరాబాద్‌లో ప్రత్యేకంగా విలేజ్ సెట్ వేసి షూటింగ్ చేయడం తెలిసిందే. చూడాలి మరి సుకుమార్ ఏం చేస్తాడు అనేది.
previous post