ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అన్ని రాష్ట్రాలకంటే విభిన్నంగా ఉంటాయి. ముక్యంగా వైసీపీ, టీడీపీల మధ్య రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి తాజాగా.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. అయితే.. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి… ట్విట్టర్ వేదికగా ట్విట్టర్ వేదికగా చంద్రబాబు, నిమ్మగడ్డపై విరుచుకుపడ్డారు. “చంద్రబాబు జీవితమంతా డబ్బు వెదజల్లడమే. చివరికి పార్టీ గుర్తుల్లేని పంచాయతీ ఎలక్షన్లలో నామినేషన్ వేస్తే బంపర్ ఆఫర్ 2 లక్షలంట! కాస్త పోటీ ఇస్తారనుకుంటే ఐదు లక్షలు. ఆన్ లైన్ లో అకౌంట్ కే జమ చేస్తాడట. దోచుకున్న లక్షల కోట్లతో ఇలా ఎన్నాళ్లైనా డబ్బు పంపిణీకి సిద్ధమంటున్నాడు.” అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఇక అంతకు ముందు ట్వీట్లో నిమ్మగడ్డపై ఫైర్ అయ్యారు విజయసాయిరెడ్డి. “రాజ్యాంగ పదవిలో ఉన్నప్పటికీ తన మంత్రదండం పనిచేయడం లేదనే అక్కసుతోనే చిత్తూరు,గుంటూరు కలెక్టర్లను మార్పించాడు నిమ్మగడ్డ. తను సెలెక్ట్ చేసిన వారే కొత్త కలెక్టర్లుగా వచ్చినా ఆ జిల్లాల్లో ఏకగ్రీవాలు భారీగా జరగడంతో మైండ్ బ్లాక్ అయింది. బాబును ఊరడించేందుకు ఫలితాలను హోల్డ్ లో పెట్టించాడు.” అంటూ పేర్కొన్నారు విజయసాయిరెడ్డి.
next post
కీర్తి సురేష్ తాజా లుక్ పై వర్మ కామెంట్స్