telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“రాకేష్ శర్మ” బయోపిక్ లో షారుఖ్

Shah-Rukh-Khan

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం “జీరో” నిజంగానే ప్రేక్షకుల చేత జీరో అనిపించుకుంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ పొందలేకపోయింది. అయితే షారుఖ్ చేసిన ఈ ప్రయోగాత్మక ప్రయత్నానికి మాత్రం ప్రశంసలు కురిశాయి. గతకొంత కాలంగా షారుఖ్ ఖాన్ కు వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. తన కెరియర్లో ఎన్నో ఎత్తు పల్లాలను చూసిన షారుఖ్ సినిమా పరాజయాన్ని అంతగా పట్టించుకోకుండా తదుపరి ప్రాజెక్టుపై దృష్టి పెడతాడు. కానీ ప్రేక్షకులు మాత్రం “జీరో” సినిమా తరువాత షారుఖ్ సినీ కెరీర్ ఇబ్బందులో పడుతుందేమో అని భావించారు.

కానీ అందరికీ షాకిస్తూ తొలి భారతీయ వ్యోమగామి “రాకేశ్ శర్మ” జీవితం ఆధారంగా రూపొందే బయోపిక్ లో నటిస్తున్నాడు షారుఖ్. ఈ సినిమాకు ఇప్పటికే “సెల్యూట్” అనే టైటిల్ ను ఖరారు చేశారు. మహేశ్ మతాహి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని సిద్ధార్థ్ రాయ్ కపూర్ నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కోసం ముంబై ఫిలిం సిటీలో భారీ సెట్ వేస్తున్నట్టుగా తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన మిగతా వివరాలను త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.

Related posts