telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పెళ్ళి పీటలెక్కిన జబర్దస్త్ మహేష్

Mahesh

ఓ వైపు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుండగా… మరోవైపు వరుసగా టాలీవుడ్ సెలబ్రిటీల పెళ్లిళ్లు జరుగుతున్నాయి. మొన్ననే ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించగా, నేడు (మే 14) టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తన ప్రేయసి పల్లవిని పెళ్లాడాడు. అయితే ఇదే రోజు మరో టాలీవుడ్ నటుడు, జబర్దస్త్ మహేష్ పెళ్లి కూడా జరిగింది. అతని పూర్తి పేరు మహేష్ ఆచంట. ‘జబర్దస్త్’ కామెడీ షోలో ‘కిరాక్ ఆర్పీ’ టీమ్‌ ద్వారా బుల్లితెరకు పరిచయమై ఎన్నో కష్టాలు పడి సినిమాల్లో అవకాశం దక్కించుకున్నాడు మహేష్. అతి తక్కువ సమయంలోనే మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. రంగస్థలం చిట్టిబాబు అసిస్టెంట్ పాత్రలో తనదైన హావభావాలతో అందరినీ మెప్పించాడు మహేష్. ‘‘శతమానం భవతి, మహానటి, ప్రతీరోజు పండగే’’ సినిమాల్లో ఆయన నటించాడు. తాజాగా మహేష్ పెళ్ళికి సంబంధించిన పిక్స్ బయటకు రావడంతో పలువురు ప్రముఖులు అతనికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలు గ్రామానికి చెందిన మహేష్.. తన బంధువుల అమ్మాయి పావనిని పెళ్లి చేసుకున్నాడు. లాక్‌డౌన్ కారణంగా అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ రోజు ఉదయం 6 గంటల 30 నిమిషాలకు పావనితో ఏడడుగులు వేశాడు మహేష్. ఈ జోడీని చూసి ‘నైస్ పెయిర్, అమ్మాయి చాలా చక్కగా ఉంది’ అంటూ అంతా అభినందిస్తున్నారు.

Related posts