telugu navyamedia
క్రీడలు వార్తలు

రెండో రోజు కూడా ఇంగ్లాండ్ దే పై చేయి…

భారత్-ఇంగ్లాండ్ మొదటి టెస్టులో రెండో రోజు కూడా పూర్తయింది. మొదటి రోజు ఆటలో ఇంగ్లీష్‌ టీమ్‌ కెప్టెన్‌ జో రూట్‌ సెంచరీ చేయడంతో ఆ జట్టు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసింది. ఇవాళ 263 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆట కొనసాగించిన నేడు 555/8 తో పటిష్టమైన స్థితిలో ఉంది. ఇక నేడు అశ్విన్‌ వేసిన 143వ ఓవర్‌లో సిక్సర్‌ తో ఇంగ్లాండ్ కెప్టెన్‌ జోరూట్‌ డబుల్‌ సెంచరీ సాధించాడు.‌ టెస్ట్‌ ఫార్మాట్‌లో ఐదోసారి ఈ ఘనత సాధించాడు రూట్. ఇక అంతకుముందు బెన్‌స్టోక్స్‌ 82పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. రూట్‌తో కలిసి అతడు నాలుగో వికెట్‌కు 124 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. కానీ స్టోక్స్ ను 82 అలాగే రూట్ ను 218 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద షాబాజ్ నదీమ్ వెనక్కి పంపాడు. అయితే రూట్ కి ఇది 100 వ టెస్ట్ మ్యాచ్ అనే విషయం తెలిసిందే. అయితే 100వ టెస్ట్ మ్యాచ్ లో 200 పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా రూట్ రికార్డు సృష్టించాడు. అయితే నేడు మొత్తం 297 పరుగులు ఇచ్చిన భారత బౌలర్లు 5 వికెట్లు సాధించారు. మరి కనీసం రేపైనా ఇంగ్లాండ్ జట్టును భారత్ ఆల్ ఔట్ చేస్తుందా.. లేదా అనేది చూడాలి.

Related posts