telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

సిపిఐ నారాయణకు వయస్సు అయిపోయింది..

ఏపీ బిజెపి ప్రధాన కార్యదర్శి యస్.విష్ణువర్ధన్ రెడ్డి కమ్యూనిస్టు పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ దేవుళ్లను రాతి విగ్రహాలతో పోల్చి… హిందువులను ఆవమానించేటువంటి సిపిఐ నేత నారాయణ హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కమ్యూనిస్టు పార్టీలకు వయస్సు అయిపోయిందని… సిపిఐ పార్టీ నేత నారాయణ కూడా వయసైపోయిందని ఎద్దేవా చేశారు. అందుకే ఇలాంటి వివాదస్పద మాటలతో మీడియా ప్రచారంతో కాలం వెల్లబుచ్చుతున్నారని… కమ్యూనిస్టుల మాటలకు చేతలకు ఏనాడు పొంతన ఉండదన్నారు. నిన్ననే దేవాలయాల గురించి దొంగ ఏడుపులతో ప్రకటనలు ఇచ్చారని… గాంధేయవాదం గురించి మాట్లాడతారు, గాంధీ జయంతి రోజు హింసా మార్గాన్ని ఎంచుకోని చికెన్ తింటారని చురకలు అంటించారు. నారాయణ కుటుంబ సమేతంగా తిరుమలకి వెళ్ళారని.. మరి తిరుమలలో మీరు మీకుటుంబం రాతిని చూసారా ?లేదా వెంకటేశ్వరుడిని దేవుడిగా చూశారా? అని ప్రశ్నించారు. కమ్యూనిస్టులకు దేవుళ్ళను అవమానించడం అలవాటుగా మారిందని ఫైర్‌ అయ్యారు. దేవుళ్ళను రాతితో పోల్చే కమ్యునిష్టులకు… దేవుళ్ళ గురించి మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది ? అని నిలదీశారు. అసలు మీ పేరులోనే ఉంది నారాయణ (వెంకటేశ్వరుడు)అది తెలుసుకోవాలని… మీ పేరు కూడా మీరు అంటున్న రాతి పేరేనని… మరీ మీ పేరు మార్చుకుంటారా? అని ఎద్దేవా చేశారు.

Related posts